- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగాలకు 10, 11 తేదీల్లో ఎంపిక పరీక్షలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న మతపరమైన పోస్టుల భర్తీలను దేవస్థాన అధికారులు భర్తీ చేయనున్నారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న మతపరమైన పోస్టుల భర్తీలను దేవస్థాన అధికారులు భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేసేందుకు దేవస్థానం అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపిక పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
రెండు రోజుల పాటు పరీక్షలు..
ఉదయం 8:00 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంపిక ప్రక్రియలో పోస్టుల వారీగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న: పరిచారిక (ప్రధాన ఆలయం), అసిస్టెంట్ పాచక (రామానుజకూటం, బ్రాహ్మణ సత్రం), డోలు, శృతి పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 11న: పరిచారిక (శివాలయం), అసిస్టెంట్ పాచక (అన్నదానం, ప్రసాదం), సన్నాయి, తాళం పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హులైన వారికి ఇప్పటికే సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ytdexam.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని లేదా దేవస్థానం ప్రధాన కార్యాలయంలోని డిస్పాచ్ విభాగంలో నేరుగా తీసుకోవచ్చని సూచించారు. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తామని, ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే 8886712367, 9912345190, 8333994019 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.






