​హుజురాబాద్ నూతన ఆర్డీఓగా జల కుమారి..

by Kodari Anjali |

హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా జల కుమారి నియమితులయ్యారు.

​హుజురాబాద్ నూతన ఆర్డీఓగా జల కుమారి..
X

​దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా జల కుమారి నియమితులయ్యారు. రాష్ట్రంలో పలువురు రెవెన్యూ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసిల్దార్లకు స్థానచలనం కలిగింది.

​జోగిపేటకు రమేష్ బాబు.. నిర్మల్ నుండి జల కుమారి..

​గత కొంతకాలంగా హుజురాబాద్ ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న రమేష్ బాబును సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట ఆర్డీఓగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం నిర్మల్ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జల కుమారిని హుజురాబాద్ నూతన ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

​త్వరలోనే బాధ్యతల స్వీకరణ..

బదిలీల ఉత్తర్వులు అందుకున్న జల కుమారి త్వరలోనే హుజురాబాద్‌లో ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ​ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ పాత స్థానాల నుండి రిలీవ్ అయి, కొత్త ప్రాంతాల్లో విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.హుజురాబాద్ నూతన ఆర్డీఓగా వస్తున్న జల కుమారి నియామకంపై స్థానిక రెవెన్యూ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Next Story