- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి
by Naga Rani Yarlagadda |
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్ 2 విభాగంలో సంభవించిన ఘోర ప్రమాదంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్ 2 విభాగంలో సంభవించిన ఘోర ప్రమాదంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉంటూ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్లాంట్ లోపల చిక్కుకుపోయిన ప్రతీ ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని అధికారులను కిషన్‌రెడ్డి కోరారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులకు,అత్యవసర వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
Next Story






