Auto Sales: వాహన మార్కెట్లో రికార్డు స్థాయి అమ్మకాలు

by S Gopi |

గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 23.10 లక్షలుగా ఉండగా, ఈసారి అన్ని విభాగాల్లో కనిపించిన డిమాండ్ వృద్ధికి దోహదపడింది.

Auto Sales: వాహన మార్కెట్లో రికార్డు స్థాయి అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ మే నెలలో రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. ఇంధన ధరల ఒత్తిడి వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా వాహనాల రిటైల్ అమ్మకాలు 9.55 శాతం పెరిగి 25.31 లక్షల యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 23.10 లక్షలుగా ఉండగా, ఈసారి అన్ని విభాగాల్లో కనిపించిన డిమాండ్ వృద్ధికి దోహదపడింది. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాలు, త్రీ-వీలర్లు, ట్రాక్టర్ల విభాగాలు గత నెలలో మెరుగైన అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయని పరిశ్రమల సంఘం ఫాడా తెలిపింది. ప్రధానంగా ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ఏకంగా 23.25 శాతం పెరిగి 4.02 లక్షల యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 18.45 లక్షల యూనిట్లతో కొత్త రికార్డు సృష్టించాయి. మరోవైపు కమర్షియల్ వాహనాల విక్రయాలు 5.29 శాతం, త్రీ-వీలర్ల అమ్మకాలు 3.56 శాతం పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన కొనుగోలు శక్తి, కొత్త మోడళ్లపై ఆసక్తి వంటి అంశాలు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. ఎలక్ట్రిక్ వాహనాలను కొనడంలోనూ వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపించారు. టూవీలర్ విభాగంలో ఈవీల మార్కెట్ వాటా గతేడాది 6.11 శాతం నుంచి 9.25 శాతానికి పెరిగింది.

Next Story