స్టీల్‌ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి.. బాధితులకు మెరుగైన వైద్యానికి ఆదేశం

by Ramesh Naini |

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద స్థలాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ భరత్ పరిశీలించారు.

స్టీల్‌ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి.. బాధితులకు మెరుగైన వైద్యానికి ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద స్థలాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ భరత్ పరిశీలించారు. నేరుగా ప్లాంట్ లోపలికి వెళ్లిన వారు.. ప్రమాదం జరిగిన తీరును అక్కడి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. గాయపడిన కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యుత్తమ, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి అనిత ఆదేశించారు.

కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌..

స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు ఒక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రుల వివరాలు, ఆసుపత్రుల సమాచారం తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ నంబర్లు: 0891-2590100, 0891-2590102 బాధితుల బంధువుల సమాచారం కోసం ఆయా ఆసుపత్రుల వివరాలు, ప్రభుత్వ అధికారుల నంబర్లను ఇక్కడ అందుబాటులో ఉంచారు. కాగా, సోమవారం జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాద ఘటనలో 9 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, ప్రదాని మోడీ సైతం వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ద్రవం పడి సజీవ సమాధి అయిన 9 మంది కుటుంబాలకు ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story