శ్రీ బాంకెట్ హల్ నిర్మాణంపై ప్రజావాణిలో ఫిర్యాదు

by Kodari Anjali |

మెట్‌పల్లి పట్టణంలో జాతీయ రహదారి పక్కన నిబంధనలను వ్యతిరేకంగా శ్రీ బాంకెట్ హల్ నిర్మించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

శ్రీ బాంకెట్ హల్ నిర్మాణంపై ప్రజావాణిలో ఫిర్యాదు
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్: మెట్‌పల్లి పట్టణంలో జాతీయ రహదారి పక్కన నిబంధనలను వ్యతిరేకంగా శ్రీ బాంకెట్ హల్ నిర్మించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ ప్రముఖులకు చెందిన బాంకెట్ హల్ నిర్మాణం నేషనల్ హైవే 63 కి అనుకొని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా, లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఏదైనా విపత్తు జరిగితే ఎదురుకోలేమి పరిస్థితిలో శ్రీ బాంకెట్ హల్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ గత నెల ఏప్రిల్ 30న మెట్‌పల్లి మున్సిపల్, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ వంకాయల ముఖేష్ చంద్ర అనే వ్యక్తి సోమవారం జగిత్యాల జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

Next Story