- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ,ఎఫెక్ట్.. అక్రమ ఇసుక రవాణా పై కలెక్టర్ సీరియస్..!
ఇందిరమ్మ ఇండ్ల కోసం అమలు చేస్తున్న "మన ఇసుక వాహనం" పథకంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.

దిశ,మహాబూబాబాద్ ప్రతినిధి : ఇందిరమ్మ ఇండ్ల కోసం అమలు చేస్తున్న "మన ఇసుక వాహనం" పథకంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అక్రమ ఇసుక రవాణా, భారీ ఇసుక డంపులు, అనుమతుల దుర్వినియోగంపై "దిశ"లో ఈరోజు (సోమవారం) ప్రచురితమైన కథనం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇసుక అందేలా చూడాలని, ఇసుక రీచ్‌ల వద్ద పకడ్బందీ పర్యవేక్షణ నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అక్రమ రవాణా, నిల్వలు, అనుమతుల దుర్వినియోగం పై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి "ఇసుక టాస్క్ ఫోర్స్ కమిటీ" ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కమిటీలో ఆర్డీవో, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్, పోలీసు శాఖ అధికారులు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, రవాణా శాఖ అధికారి తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు.ఈ కమిటీ మన ఇసుక వాహనం పథకం అమలును పర్యవేక్షించడంతో పాటు అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఇసుక తరలింపు ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఉదయం వేళల్లో మాత్రమే రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు.






