- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజావాణి దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు సమర్పించే దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.

దిశ, మంచిర్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు సమర్పించే దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నస్పూర్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు దరఖాస్తులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తులు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు...
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 31,32 డివిజన్ల కు సంబంధించిన గ్రామసభలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, డీఎస్పీ ఏ.భాస్కర్, కమిషనర్ అన్వేష్, కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్యం, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ, అరవై- అలైవ్, ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ సభలో చర్చించారు. పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటింటికి తడి పొడి చెత్తను సేకరించి నిర్వీర్యం చేయడం ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ప్రత్యేక కార్యాచరణ దిశగా ముందుకు వెళ్లాలన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. బూత్ స్థాయి ఏజెంట్ల సహకారంతో ఇంటింటికి తిరిగి వారాలను అందజేసి ఓటర్ల సవరింపు ప్రారంభించాలని అన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య, రోడ్డు భద్రత, విద్యావ్యవస్థ దిశగా ప్రభుత్వం పట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో అన్ని ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహార పథకం కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. వైద్య, మహిళా రక్షణ, ప్రభుత్వ పథకాల అమలుపై కార్లకు పలు సూచనలు చేశారు. అనంతరం మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ను చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






