- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పార్టీ శ్రేణులకు జగన్ కీలక ఆదేశాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్‌ఎంఎస్-2లో హాట్ మెటల్ బకెట్లు కూలి లిక్విడ్ స్టీల్ పడటంతో పలువురు కార్మికులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు....

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్‌ఎంఎస్-2(Visakhapatnam Steel Plant SMS-2)లో హాట్ మెటల్ బకెట్లు(Hot metal buckets) కూలి లిక్విడ్ స్టీల్(Liquid steel) పడటంతో పలువురు కార్మికులు(Workers) మృతి చెందడంపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్(Former CM and YSRCP President YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కఠిన సమయంలో ఆయా కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన, అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
కారణాలపై సమగ్ర విచారణ జరపాలి
పారిశ్రామిక సంస్థల్లో భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, కార్మికుల ప్రాణాల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నొక్కిచెప్పారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విచారకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎల్లప్పుడూ అండగా ఉంటాం..
ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తక్షణమే స్పందించి బాధితులను పరామర్శించాలని ఆదేశించారు. ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడంతో పాటు, గాయపడిన వారికి అందుతున్న వైద్య చికిత్సను నిరంతరం పర్యవేక్షించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.






