నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి : జిల్లా ఎస్పీ జానకి

by Batti.Sumithra |

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిష్పక్షపాతంగా, సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు.

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి : జిల్లా ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిష్పక్షపాతంగా, సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా, నవాబుపేట్ మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన వి.నరేందర్ సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ నరేందర్ కు ఆమె శుభాకాంక్షలు తెలిపి, ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తాను మండల ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఎస్ఐ నరేందర్ తెలిపారు.

Next Story