- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ బావ మరదలు పంచాయితీలోకి నన్నెందుకు లాగుతున్నావ్?.. కవితకు ఎంపీ రఘునందన్ రావు కౌంటర్
కవిత ఆరోపణలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. బావమరదళ్ల పంచాయితీలోకి నన్ను లాగొద్దంటూ కవితను హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రఘునందన్ రావు బీఆర్ఎస్, హరీశ్ రావుతో కుమ్మక్కు అయ్యారంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. కవిత స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా? లేకుండా మాట్లాడుతున్నారా? అపజయం ఎరుగని ఆరడుగుల బుల్లెట్టు అని మీరంతా అనుకున్న హరీశ్ రావును దుబ్బాకలో గీత గీసి మరీ ఓడించిన వాడు ఈ తెలంగాణలో ఎవరైనా ఉన్నారు అంటే అది రఘునందన్ రావేనన్నారు. మీకు మీ బావకు పడకపోతే మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. మీ బావ మరదలు పంచాయితీలోకి నన్నెందుకు లాగుతున్నారు అంటూ సీరియస్ అయ్యారు. ఇవాళ సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. కవితకు జహీరాబాద్ ఎంపీ ఎవరో మెదక్ ఎంపీ ఎవవరో తెలియడం లేదని మండిపడ్డారు. సింగూల్ బాగుపడకపోతే మీ బావను, మీ నాన్నను తిట్టాలన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఏనాడైనా ఉమ్మడి మెదక్ జిల్లా బాగోగులు పట్టించుకున్నారా? అని విమర్శించారు. సంగారెడ్డికి వచ్చి నన్ను, హరీశ్ రావు, దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డిని నాలుగు మాటలు అంటే మేము తిరిగి విమర్శిస్తే వార్తల్లో ఉంటానని కవిత అనుకుంటున్నారని దుయ్యబట్టారు.
చెల్లె అంటూనే సెటైర్లు:
కవితను విమర్శించాలంటే ఆమెకు ఏ హోదా ఉందని విమర్శించాలన్నారు. కవిత ఎమైనా ఎమ్మెల్యేనా? ఎంపీనా? మంత్రినా? అని ప్రశ్నించారు. రఘునందన్ రావు పటాన్‍చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ములాఖత్ అయి రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. మరి నువ్వు ఎవరితో కలిసి రాజకీయాలు చేస్తున్నావ్ చెల్లే?. నీ రాజకీయం ఏంది? టీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఎక్కడివి అని ప్రశ్నించారు. భాష మర్యాదగా ఉంటే మేము కూడా మర్యాదగా మాట్లాడుతామన్నారు. అన్నింటికీ రఘునందన్ రావు నోరు వేసుకొని పడిపోతాడని అంటున్నావ్.. బరాబర్ అరుస్తాం. ఇలా అరిసి అరిసి తెలంగాణ తెచ్చాం. లాలూచీ అనే పదానికి ఏదైనా అర్థం ఉంటే అది మీరు మీ కుటుంబానికి వర్తిస్తుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అన్నారు. మీతో మీ కుటుంబంతో లాలూచీ రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. కావాలనే రఘునందన్ రావు నోట్లో నోరు పెట్టి ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండాలనుకుంటే అది జరగదన్నారు. మళ్లీ నా గురించి ఇలాగే మాట్లాడితే ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్లు ఉంటుందన్నారు. నిన్న మాట్లాడిన మాటలను వదిలేస్తే ఇట్లే రోజు ఏది పడితే అది మాట్లాడుతావ్ కాబట్టి నీ నోరు మూయించడానికే నేను ఇవాళ మాట్లాడుతున్నానన్నారు. మరోసారి సంగారెడ్డికి వచ్చి రఘునందన్ రావుపై మాట్లాడితే బంజారాహిల్స్ లోని మీ ఇంటి గేటుముందుకు వచ్చి మైక్ పెట్టి మరీ మాట్లాడుతానన్నారు.






