సదాశివపేటలో మొసలి పిల్లలు కలకలం..

by Taduka Kalyani |

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో మొసలి పిల్లలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

సదాశివపేటలో మొసలి పిల్లలు కలకలం..
X

దిశ, సదాశివపేట : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో మొసలి పిల్లలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మండలంలోని మిలిగిరిపేట గ్రామ శివారులోని పొలాల వద్ద పశువులను మేపుతున్న కాపరులకు సుమారు 20కిపైగా మొసలి పిల్లలు కనిపించాయి. దీంతో వారు వెంటనే గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, మిలిగిరిపేట ప్రాజెక్టు పరిధిలోని వాగు సమీపంలో సుమారు 60కు పైగా మొసలి గుడ్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు మొసలి పిల్లలు, గుడ్లను సురక్షితంగా సంగారెడ్డి జిల్లా కల్పగూర్ గ్రామంలోని అభయారణ్యానికి తరలించారు. కాగా, సమీపంలోని చెరువులో పెద్ద మొసళ్లు ఉండే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, చెరువుల సమీప ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Next Story