- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్ ప్రత్యేక సవరణ కార్యక్రమంపై కేఎంసీ కమిషనర్ తనిఖీ..
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు.

దిశ, ఖమ్మం కార్పొరేషన్: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (సర్ )లో భాగంగా జరుగుతున్న డోర్ టు డోర్ వెరిఫికేషన్‌ను కమిషనర్ సోమవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు, ఏఈఆర్వో, సూపర్వైజర్లతో మాట్లాడి పనుల పురోగతి, వివరాల ఖచ్చితత్వం, నమోదు ప్రక్రియను సమీక్షించారు. పరిశీలన సమయంలో డ్రాఫ్ట్ అనొమాలీస్ జాబితాలో ఉన్న వివరాలను పరిశీలించి, మ్యాపింగ్ లోపాలు, నివాస వివరాలు, కుటుంబ వివరాలు ఇతర వ్యత్యాసాలను క్షేత్రస్థాయిలో ఎలా పరిశీలిస్తున్నారో అనే అంశాన్ని పరిశీలించారు.
మనందరి బాధ్యత..
ప్రతి వివరాన్ని జాగ్రత్తగా తనిఖీ చేసి, ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు గుర్తించిన అన్ని అంశాలను (అనొమాలీస్) వచ్చే మూడు రోజుల్లో పూర్తిగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఏదైనా సందేహం ఉంటే వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి స్పష్టత తీసుకుని పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, “ప్రతి అర్హత గల ఓటరు పేరు సరైన వివరాలతో ఓటరు జాబితాలో ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని.. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించడం, మ్యాపింగ్ లోపాలను గుర్తించడం, నమోదు చేసిన సమాచారాన్ని ధృవీకరించడం ద్వారా మాత్రమే ఖచ్చితమైన ఓటరు జాబితా సిద్ధమవుతుందని పేర్కొన్నారు.






