- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యాయవాద రక్షణ చట్టం అమలు చారిత్రాత్మకం..
తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఖమ్మం కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.

దిశ, ఖమ్మం లీగల్: న్యాయవాదుల భద్రత, వృత్తి గౌరవ పరిరక్షణకు కీలకమైన న్యాయవాద రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఖమ్మం కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. న్యాయవాదుల చిరకాల వాంఛగా ఉన్న ఈ చట్టం అమల్లోకి రావడం న్యాయ వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎడ్లపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాదులపై పెరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం అవసరం చాలా కాలంగా ఉందని, ఆ అవసరాన్ని గుర్తించి న్యాయవాద రక్షణ చట్టం అమలు దిశగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనీయులని పేర్కొన్నారు. ఈ చట్టం న్యాయవాదులకు భద్రత కల్పించడమే కాకుండా న్యాయ వృత్తి గౌరవాన్ని మరింత పెంచుతుందని అన్నారు.
రాష్ట్రంలోని న్యాయవాదులందరి తరపున..
అనంతరం పలువురు కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయవాదులు మాట్లాడుతూ, ప్రజలకు న్యాయం అందించడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని న్యాయవాదులందరి తరపున తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సింగం జనార్ధన్, కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయవాదులు కర్లపూడి శ్రీనివాసరావు, బత్తుల బసవ పున్నయ్య, మలీదు నాగేశ్వరరావు, రావూరి నరసింహారావు, ఏజీపీ రత్నాకర్, హేమంత్, కేఎల్ఎన్ శాస్త్రి, మోజెస్ క్రిస్టఫర్, ఇమ్మడి లక్ష్మీనారాయణ ఎస్వీ రమణ, ఎస్.కె లతీఫ్, శేషగిరి, మద్దెల వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ గుప్తా, గురు కృష్ణ, కోటి, దానయ్య, శేఖర్, డోన్వన్ వెంకీయా, నరసింహారావు, రాకేష్, పాటు మహిళా న్యాయవాదులు జాలావతి, ఆవుల అనురాధ, పద్మావతి, దేవరకొండ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.






