ఇంత పెద్ద తప్పు చేసినా ఎందుకు సస్పెండ్ చేయలేదు: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసులో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు..

ఇంత పెద్ద తప్పు చేసినా ఎందుకు సస్పెండ్ చేయలేదు:  సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసు(Land Grabbing Case)లో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు(Vinukonda Former Mla Bolla Brahmanaidu)ను తెలంగాణ పోలీసులు(Telangana Police) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం(Siddantam)లో ‘మీ భూమి-మీ హక్కు’(Mee Bhumi – Mee Hakku’) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బొల్లా బ్రాహ్మనాయుడి కబ్జా పర్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.1500 కోట్ల భూ కబ్జా.. చేసిన సదరు నేతను ఆ పార్టీ అధ్యక్షుడు ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. బొల్లా బ్రహ్మనాయుడు తెలంగాణకు పారిపోయి అక్కడ ఫోర్జరీ సంతకాలతో రూ.1500 కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఉన్నందున ఇక్కడ ఆటలు సాగవనే భయంతోనే పక్క రాష్ట్రంలో రికార్డులు తారుమారు చేశారన్నారని ఆరోపించారు. ఇంత పెద్ద తప్పు చేసినా సదరు నేతను ఆ పార్టీ అధ్యక్షుడు ఎందుకు సస్పెండ్ చేయలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

Next Story