- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టపగలే చోరీ.. ఐదున్నర తులాల బంగారంతో పాటు 33 తులాల వెండి అపహరణ
పట్టపగలే ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని బంగారం, వెండి దుండగులు దోచుకెళ్లిన ఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజలాపురంలో జరిగింది.

దిశ, మోత్కూరు: పట్టపగలే ఇంటి తాళం పగలగొట్టి బీరువా తలుపులు తెరిచి ఐదున్నర తులాల బంగారం 33 తులాల వెండితో పాటు 5000 చోరీ జరిగిన సంఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజలాపురంలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దీంతో మున్సిపాలిటీతో పాటు ఇరుగుపొరుగు గ్రామాలలో కలకలం రేపింది. బాధితులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు అనాజిపురం రహదారికి సమీపంలో ఉండే మలిపెద్ది వెంకటరెడ్డి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎరువుల బస్తాలు విత్తనాలు తెచ్చేందుకు తాళం వేసి మోత్కూర్ కు వెళ్లాడు. రెండు రోజులకు ముందే అతని భార్య పద్మ బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం. వెంకటరెడ్డి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి బీరువా తలుపులు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగిందని భావించి వెంటనే పోలీసులు సమాచారం అందించాడు.
ఇంటికి తాళం వేసి పోవాలన్న భయమే..
ఇంతలో ఇంట్లో పోయిన వస్తువుల గురించి పద్మ అందించిన వివరాల ప్రకారం.. నాలుగు తులాల చంద్రహారం, అర తులం బ్రాస్లెట్, అర తులం రెండు రింగులు, అర తులం రెండు కమ్మలు, మొత్తం ఐదున్నర తులాల బంగారంతో పాటు మూడు తులాల వెండి చైన్, 30 తులాల రెండు జతల పట్టగొలుసులు.. అలాగే 5000 నగదు చోరీ జరిగినట్లు తెలిపారు. గత పక్షం రోజుల కిందటనే గ్రామంలో నగదు చోరీకి గురి కావడంతో పాటు గత మంగళవారం అనాజిపురంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. దీంతో వ్యవసాయ పనులకు ఇంటికి తాళం వేసి పోవాలన్న భయం గొలుపే పరిస్థితులు నెలకొనడం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జరిగిన సంఘటన మేరకు వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగా సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.






