సీజ్ చేసిన వాహనాల బహిరంగ వేలం..

by Kodari Anjali |

వివిధ కేసుల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారు సీజ్ చేసిన వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు దేవరకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

సీజ్ చేసిన వాహనాల బహిరంగ వేలం..
X

దిశ, దేవరకొండ టౌన్: వివిధ కేసుల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారు సీజ్ చేసిన వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు దేవరకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం ప్రక్రియ జూన్ 10, 2026 బుధవారం ఉదయం 10:00 గంటల నుండి దేవరకొండ ఎక్సైజ్ స్టేషన్ ప్రాంగణంలో ప్రారంభం కానుంది. నల్గొండ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సమక్షంలో ఈ వాహనాల వేలం పాట జరుగుతుంది. వేలంలో పాల్గొనడానికి ఆసక్తి గల బిడ్డర్లు జూన్ 10 ఉదయం 10:00 గంటలకు నిర్ణీత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలకు రూ. 10,000/- సెక్యూరిటీ డిపాజిట్, నాలుగు చక్రాల వాహనాలకు రూ. 30,000/- సెక్యూరిటీ డిపాజిట్. వేలంలో వాహనాలను దక్కించుకోని (పాట పాడని) వారికి ఈ డిపాజిట్ మొత్తాన్ని అదే రోజున తిరిగి ఇచ్చివేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారులు నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ, నిర్ణీత సమయానికి హాజరై వేలంలో పాల్గొనాలని కోరారు. వేలానికి గురయ్యే వాహనాల పూర్తి జాబితా, ఇతర నిబంధనల వివరాల కొరకు దేవరకొండ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చు.

Next Story