- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి: డిప్యూటీ మేయర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని రామగుండం నగర డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య అన్నారు.

దిశ, గోదావరిఖని: కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, ఆర్‌పీలు సమన్వయంతో పని చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని రామగుండం నగర డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 1. 2,3,4, 24,25,26,27,28,29,30,31,32,33, 34 డివిజన్ లకు సంబంధించిన క్లస్టర్ లెవెల్ వార్డు సభ ఎన్‌టిపిసి, పిటీఎస్‌లోని కాకతీయ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి అర్హులకు అందేలా చూడాలని అన్నారు. నగరాన్ని స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ఎమ్మెల్యే, మేయర్‌తో సహా వార్డు బాట పట్టడం జరిగిందని అన్నారు. గత రెండు నెలలుగా ఉదయం 6 గంటల నుండి వార్డుల్లో తిరుగుతూ స్వచ్చతా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని అన్నారు.
నీళ్లు సాఫీగా ప్రవహించేలా..
రాబోయే వర్షాకాలంలో ఏ విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. సెల్ ఫోన్ కారణంగా పిల్లలు చెడిపోతున్నారని, వ్యసనాల బారిన పడి దారి తప్పుతున్నారని అన్నారు. పోలీస్ అధికారుల సూచనలను తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకొని తమ పిల్లలు ఏమి చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని అన్నారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ జె.అరుణశ్రీ మాట్లాడుతూ.. రుతుపవనాల ప్రభావానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేస్తున్నామని అన్నారు. వరదలు రాకుండా నీళ్లు సాఫీగా ప్రవహించేలా కాలువల్లో పూడిక తొలగించామని అన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నీళ్లు ఎక్కడా నిలువ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శిథిలావస్థకు చేరిన కట్టడాలు తొలగిస్తామని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. పైప్ లైన్ లీకేజీ మరమ్మత్తులు ఎప్పటికప్పుడు పూర్తి చేసి నీళ్లు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు కాచి చల్లార్చి వడబోసిన నీటిని తాగాలని సూచించారు.
వరద ప్రభావం నివారించడానికి..
దోమలు పెరగకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఘన వ్యర్ధ పదార్థాల నిర్వహణకు సంబంధించి 2016 నిబంధనల ప్రకారం.. చెత్తను నాలుగు రకాలుగా విభజించాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్త, సానిటరీ చెత్త, ఎలక్ట్రానిక్ వస్తువులను వేర్వేరుగా విభజించి ఇవ్వాలనే అన్నారు. సర్ లో భాగంగా ఓటరు జాబితా మాపింగ్ ప్రక్రియ జూన్ 15 వరకు పూర్తి చేయాలని అన్నారు. వరద ప్రభావం నివారించడానికి అలాగే భూ గర్భ జలమట్టం పెరగడానికి నీటి కన్జర్వేషన్ చర్యలు చేపట్టి ఇంకుడు గుంతలు నిర్మించాలని అన్నారు. అన్ని వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తామని అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు అన్వేషించి జాబితా తయారు చేసుకోవడం జరుగుతున్నదని అన్నారు.
జాగ్రత్తలు తీసుకోవడంపై..
ఈ కార్యక్రమంలో ఎసిపి ముడుత రమేష్ అరైవ్ అలైవ్, ట్రాఫిక్ నిబంధనలు వివరించడంతో పాటు తల్లి దండ్రులు తమ పిల్లల అలవాట్లపై నిఘా ఉంచాలని సూచించారు. రామగుండం ఎం ఆర్ ఓ రవీందర్ ఓటరు జాబితా సర్ పై అవగాహన కల్పించారు. తమ ఓట్లు పోతాయని అపోహ పడవద్దని అన్నారు. అంటువ్యాధులు అరికట్టడం, జాగ్రత్తలు తీసుకోవడంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారి అతుల్య అవగాహన కల్పించారు. అంగన్ వాడీ కార్యకలాపాలపై ఐ సి డి ఎస్ సి డి పి ఓ ఆలేఖ్య పటేల్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ నాయిని వెంకటస్వామి, అసిస్టెంట్ కమీషనర్ సంపత్, ఎ సి పి శ్రీహరి, పోలీస్, రెవిన్యూ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.






