CBDT: పన్ను ఎగవేతదారులపై ఐటీ శాఖ ఫోకస్

by S Gopi |

2025-26లో దాఖలు చేసిన ఐటీ రిటర్నులపై సవివరమైన పరిశీలన కోసం నోటీసులు పంపడానికి జూన్ 30ని ఆఖరి గడువుగా నిర్ణయించింది.

CBDT: పన్ను ఎగవేతదారులపై ఐటీ శాఖ ఫోకస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆదాయపు పన్ను శాఖ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ రిటర్నులను లోతుగా పరిశీలించడానికి సరికొత్త గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. ఈసారి ఐటీ శాఖ రూ. 26.97 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను సాధించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందుకోసం పన్ను ఎగవేతదారులను పట్టుకునేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసింది. చట్టం ప్రకారం, 2025-26లో దాఖలు చేసిన ఐటీ రిటర్నులపై సవివరమైన పరిశీలన కోసం నోటీసులు పంపడానికి జూన్ 30ని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ముఖ్యంగా ఆఫీసులపై సోదాలు జరిగిన కేసులు, పన్ను ఎగవేతపై పక్కా సమాచారం ఉన్న అకౌంట్లతో పాటు, 2025, మార్చి 31 నాటికి రిజిస్ట్రేషన్ రద్దయినప్పటికీ ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసిన ట్రస్టులు, ఎన్జీఓల అకౌంట్లను ఈసారి తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయనున్నారు. అలాగే, గతంలో తప్పుడు లెక్కల వల్ల అదనంగా పన్ను పడి, ఆ మొత్తం హైదరాబాద్, ముంబై వంటి మెట్రో నగరాల్లో రూ. 50 లక్షలు, ఇతర నగరాల్లో రూ. 20 లక్షలు దాటిన పాత కేసులను కూడా ఐటీ శాఖ మళ్లీ తిరగదోడనుంది.

అయితే, ఈ కొత్త రూల్స్ వల్ల రోజూ పద్ధతిగా ట్యాక్స్ కట్టే సామాన్యులకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే, కంప్యూటర్ సిస్టమ్స్ లేదా ఏఐ సాఫ్ట్‌వేర్ పట్టుకునే చిన్న చిన్న తప్పులు, వ్యత్యాసాలను చూసి ఐటీ శాఖ నేరుగా లోతైన విచారణకు తీసుకోదు. పన్ను ఎగవేసినట్లు పక్కా ఆధారాలు ఉంటేనే నోటీసులు పంపుతామని స్పష్టం చేసింది. అయితే, విదేశీ లావాదేవీలు చేసే పెద్ద కంపెనీలు, భారీగా పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నవారిని మాత్రం అధికారులు నేరుగా విచారిస్తారు. నిజాయితీగా ఉండే ట్యాక్స్ పేయర్లను ఇబ్బంది పెట్టకుండా, కేవలం మోసాలకు పాల్పడేవారిని మాత్రమే పట్టుకోవాలన్నదే ఐటీ శాఖ ప్లాన్. కాబట్టి, పెద్ద పెద్ద బిజినెస్ లావాదేవీలు చేసేవారు తమ బిల్లులు, లెక్కలను పక్కాగా ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని విశ్లేషకులు పేర్కొన్నారు.

Next Story