- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యాన్ హోల్లో చిక్కుకున్న బాలుడు
సచివాలయం బస్‌స్టాప్ సమీపంలో ఓ 10 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో కాలు ఇరుక్కుపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

దిశ, ఖైరతాబాద్ : సచివాలయం బస్‌స్టాప్ సమీపంలో ఓ 10 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో కాలు ఇరుక్కుపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు డయల్-100కు ఫిర్యాదు అందుకున్న సైఫాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందినపోలీస్ కానిస్టేబుల్ ఎ.ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరించి బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో బాలుడికి ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా పోలీసులు, ఫైర్ సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు నిర్వహించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన మ్యాన్‌హోల్ సమస్యను వెంటనే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. ప్రజల భద్రతకు ముప్పుగా మారే ఇలాంటి సమస్యలను త్వరితగతిన గుర్తించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని స్థానికులు సైఫాబాద్ పోలీసుల సేవలను ప్రశంసించారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో అప్రమత్తంగా వ్యవహరించిన సైఫాబాద్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి స్థానికులు అభినందనలు తెలిపారు.






