- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పెద్ది' వివాదం.. జాన్వీ కపూర్ బోల్డ్ సీన్లపై కంగనా రనౌత్ సంచలన కామెంట్స్
'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర వివాదంపై కంగనా రనౌత్ స్పందించారు. మేకర్స్ కావాలని చేయరని, హీరోయిన్లే నోరు విప్పాలని సూచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) చుట్టూ ముసురుకున్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను ప్రజెంట్ చేసిన విధానంపై ఆడియన్స్ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పటికే క్షమాపణలు చెప్పినా వివాదం మాత్రం కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో, సినిమాల్లో మహిళలను కేవలం ఒక వస్తువుగా చూపించడంపై ప్రముఖ నటి కంగనా రనౌత్ తాజాగా స్పందించారు. తన తాజా చిత్రం 'భారత్ భాగ్య విధాత' ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె.. హీరోయిన్లు ఇలాంటి వాటిపై నోరు విప్పాలన్నారు. సీన్ చూసేటప్పుడుతప్పుగా నిపిస్తోందని మేకర్స్ కు స్ట్రెయిట్‍గా చెప్పాలని సూచించారు.
అందులో వాళ్లకు తప్పు కనిపించదు:
నా అనుభవం ప్రకారం.. ఏ దర్శకుడు లేదా రచయిత కూడా 'రండి, ఈ పాత్రను అశ్లీలంగా చూపిద్దాం' అని ఉద్దేశపూర్వకంగా సినిమా తీయరు. అయితే, కథ రాసేటప్పుడు వారి ఆలోచనలు వేరేలా ఉండవచ్చుని అన్నారు. చాలా సార్లు మేల్ రైటర్స్ కథలు రాసేటప్పుడు ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ మిస్ అవుతారని కంగనా అభిప్రాయపడ్డారు. డైరెక్టర్లు కావాలని అలా చేయకపోవచ్చు. కానీ మగవాళ్లు కలిసి స్టోరీ రాసుకునేటప్పుడు వాళ్లు అందులో తప్పు కనిపించదని అదే ఒక మహిళగా మన ఫీలింగ్స్ చెప్తే వాళ్లు కచ్చితంగా అర్థం చేసుకుంటారన్నారు. సినిమా అనేది ఒక సమిష్టి కృషి అని మన ఫీలింగ్స్ చెప్తే వాళ్లు అర్థం చేసుకుంటారని తెలిపారు. ఇదిలా ఉంటే, కంగనా రనౌత్ నటించిన 'భారత్ భాగ్య విధాత' చిత్రం జూన్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో ఆమె ఒక స్టాఫ్ నర్సు పాత్రలో కనిపించనున్నారు. ఒక భీకర ఉగ్రవాద దాడి సమయంలో 400 మందికి పైగా ప్రాణాలను కాపాడిన సాధారణ ప్రజల అసాధారణ ధైర్యసాహసాల కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.






