- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికుల కష్టాలకు చెక్.. కొత్త రిజర్వేషన్ సిస్టమ్‌ను తీసుకురానున్న రైల్వేశాఖ
ఇండియన్ రైల్వే అతిపెద్ద సాంకేతిక మార్పు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ రైల్వే అతిపెద్ద సాంకేతిక మార్పు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. 1986 నుంచీ అమల్లో ఉన్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) స్థానంలో.. లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన కొత్త రిజర్వేషన్ వ్యవస్థను రెండు నెలల్లో అమల్లోకి తీసుకురానుంది. ఆగస్టు నుంచి దశలవారీగా కొత్త రిజర్వేషన్ సిస్టమ్ ను అమల్లోకి తీసుకురానున్నట్లు ఇండియన్ రైల్వే పేర్కొంది. ఈ మార్పుతో.. ప్రయాణికులకు టికెట్ ను రిజర్వేషన్ చేసుకోవడం మరింత వేగం కానుంది. దీనివల్ల సర్వర్ కూడా డౌన్ అవ్వదని, ఒకే సమయంలో లక్షల మంది టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపింది. దీనివల్ల వ్యవస్థ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. కొత్త రిజర్వేషన్ వ్యవస్థ అమలు పురోగతిని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్ భవన్లో సమీక్షించారు. ఈ మార్పు వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు.
40 ఏళ్ల పాత వ్యవస్థకు వీడ్కోలు
ప్రస్తుతం అమల్లో ఉన్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను రైల్వేశాఖ 1986లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి కొన్ని పరిమిత అప్ గ్రేడ్స్ మాత్రమే జరిగినప్పటికీ.. పెరుగుతున్న ఆన్లైన్ టికెట్ బుకింగ్ అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో అప్డేట్ చేయలేదు. దీంతో కొత్త PRS వ్యవస్థను లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించి.. అధిక సంఖ్యలో వినియోగదారుల రిక్వెస్ట్ లను ఒకేసారి నిర్వహించేలా అభివృద్ధి చేశారు. భారతీయ రైల్వే.. 2002లో ఇంటర్నెట్ నుంచి టికెట్ బుకింగ్ చేసుకునే వ్యవస్థను ప్రారంభించగా.. నేటికి 88 శాతం టికెట్లు ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయి. ప్రధానంగా రైల్ వన్ యాప్ ను ఎక్కువగా వాడుతున్నట్లు రైల్వేశాఖ గుర్తించింది. 2025 జులైలో ప్రారంభించిన ఈ యాప్ నకు ప్రయాణికుల నుంచి విశేషస్పందన లభిస్తోంది.
ఏడాది లోగానే ఈ యాప్ ను 3.5 కోట్లమందికి పైగా ప్రయాణికులు డౌన్లోడ్ చేసుకున్నారు. టికెట్ బుకింగ్, క్యాన్సిలింగ్, రన్నింగ్ స్టేటస్, ప్లాట్ ఫామ్ నంబర్, కోచ్ పొజిషన్ వంటి సమాచారాలను తెలుసుకోవడంతో పాటు.. ఫిర్యాదులను కూడా ఈ యాప్ ద్వారానే చేయవచ్చు. రైల్వేశాఖ తెలిపిన అధికారిక సమాచారం ప్రకారం.. ప్రతిరోజూ సుమారు 9.29 లక్షల టికెట్లు రైల్ వన్ యాప్ ద్వారా బుక్ అవుతున్నాయి. 7.2 లక్షల అన్ రిజర్వ్డ్ టికెట్లు, 2.09 లక్షల రిజర్వ్డ్ టికెట్లు ఉన్నాయి.






