- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాస్ వినియోగదారులపై అదనపు భారం మోపొద్దు: మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకురాలు
ప్రభుత్వం తక్షణమే ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకురాలు గందే మాధవి అన్నారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ (ఎల్పీజీ) ధరలను వరుసగా పెంచుతూ సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ గందే మాధవి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్యాస్ ధరల పెంపు కుటుంబాల బడ్జెట్‌ను మరింత దెబ్బతీస్తోందన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పేరుతో పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు అదే పేదలపై ధరల భారాన్ని మోపడం దురదృష్టకరమని ఆమె విమర్శించారు.
గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి..
గత కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు గణనీయంగా పెరిగి మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని, మహిళలపై ఈ భారం ఎక్కువగా పడుతోందని తెలిపారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, సబ్సిడీని పునరుద్ధరించి వినియోగదారులకు ఉపశమనం కల్పించాలని గందే మాధవి డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని ఆమె సూచించారు.






