- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. KCR బస్సు యాత్రపై కీలక అప్‍డేట్
కేసీఆర్ బస్సు యాత్రపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా వస్తే తమ నెత్తిన పాలు పోసినట్లేనన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఎవరికి వారు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావడంపై కీలక అప్ డేట్ వచ్చించి. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు ఓ న్యూస్ చానల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేసీఆర్‍కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని ఇంత కాలం కేసీఆర్ చూశారని ఆ సమయం ముగిసిపోయిందన్నారు. ఇక మీదట కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్‍గా ఉండబోతున్నారని.. రాబోయో రోజుల్లో తెలంగాణ భవన్ కు, ప్రజా ఉద్యమాలు, జిల్లా పర్యటనలు స్లోగా పెంచుతూ ఎన్నికలకు ఎడాది ముందు 2027లో కేసీఆర్ రాష్ట్రమంతటా బస్సుయాత్ర చేయబోతున్నారని చెప్పారు.
కూటమిగా వస్తే మా నెత్తిన పాలు పోసినట్లే:
తెలంగాణలో బీజేపీ, జనసేన, టీడీటీ కూటమి ఏర్పడితే మా నెత్తిన పాలు పోయడమే అవుతుందని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వార్ వన్ సైడ్ అయ్యేందుకు ఈ కూటమి ఉపయోగపడుతుందన్నారు. ఇది బీఆర్ఎస్‍కు మేలు జరుగుతుందన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పరిస్థితి భిన్నంగా ఉందని జాతీయపార్టీలతో పొత్తు లేకుండా వెళ్లిన పార్టీ పరిస్థితిలు భిన్నంగా ఉన్నాయన్నారు. కవితతో విభేదాలు, టీఆర్ఎస్ పార్టీ ప్రభావంపై హరీశ్ రావు స్పందించడానికి నిరాకరించారు.






