పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఎల్బీ నగర్ ఎమ్మెల్యే

by Batti.Sumithra |

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఎల్బీ నగర్ ఎమ్మెల్యే
X

దిశ, వనస్థలిపురం : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగోల్, బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ఐకాన్ వాకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో 'ప్రకృతిని ప్రేమిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం' అనే సందేశంతో చేపడుతున్న కార్యక్రమానికి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజూ నడక అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ వాకర్స్ గ్రూప్ అధ్యక్షుడు చెరుకు ప్రశాంత్ గౌడ్, జనరల్ సెక్రటరీ రమేశ్ గౌడ్ ఇతర సభ్యులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.

Next Story