బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపికైన సోమ శాంత కుమార్

by Jakkula.Mamatha |

బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డు - 2026 సంవత్సరమునకు గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం పీఏసీఎస్ చైర్మన్ సోమ శాంత కుమార్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ ప్రకటించారు.

బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపికైన సోమ శాంత కుమార్
X

దిశ, మహాముత్తారం: బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డు - 2026 సంవత్సరమునకు గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం పీఏసీఎస్ చైర్మన్ సోమ శాంత కుమార్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ ప్రకటించారు. అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ బీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ & మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు.

ఈ సంవత్సరం జులై 12వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్ లో నిర్వహించే బహుజన సాహిత్య అకాడమీ 19వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని 5 రాష్ట్రాలైనా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా, తెలంగాణ, రాష్ట్రాల నుండి సుమారు 600 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరవుతారని తెలిపారు. ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో బీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు, సెక్రటరీ కనుకుంట్ల విజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికంటి ఐలయ్య, అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్లు ఉన్నారు.

Next Story