రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

by Taduka Kalyani |

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లి సమీపంలోని బట్టెమ్మ గుడి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం
X

దిశ, కౌడిపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లి సమీపంలోని బట్టెమ్మ గుడి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన ఇస్నగారి చంద్రకాంత్, నందికందికి చెందిన స్నేహితుడు అభిషేక్ తో కలిసి TG15 BA 0041 బైక్ పై మెదక్ లో ఉన్న సోదరి ప్రియాంక వద్దకు నర్సాపూర్ వైపు నుంచి ఆదివారం రాత్రి వెళ్తున్నారు. ఈ క్రమంలో బట్టెమ్మ గుడి సమీపంలో మెదక్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై మెదక్ వైపు నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం బైక్ పై ఉన్న ఇద్దరి యువకులను బలంగా ఢీకొంది. ఇరువురికి బలమైన రక్త గాయాలయ్యాయి. కాళ్లు చేతులు విరిగాయి. తీవ్రమైన రక్త గాయాలైన అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రకాంత్ ను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. చంద్రకాంత్ సోదరుడు ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అమరేందర్ రెడ్డి తెలిపారు.

Next Story