- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యర్థాలు కాలిస్తే రూ.5 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా..
పంట పొలాల్లో వరి కొయ్యలను, ఇతర వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టే రైతులపై రూ. 5,000ల నుండి రూ. 25,000ల వరకు భారీ జరిమానా విధించేలా గ్రామ ప్రజలందరి ఏకగ్రీవ ఆమోదంతో సభలో తీర్మానం చేశారు.

దిశ, కోరుట్ల రూరల్: పంట పొలాల్లో వరి కొయ్యలను, ఇతర వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టే రైతులపై రూ. 5,000ల నుండి రూ. 25,000ల వరకు భారీ జరిమానా విధించేలా గ్రామ ప్రజలందరి ఏకగ్రీవ ఆమోదంతో సభలో తీర్మానం చేశారు. మండలంలోని మోహన్‌రావుపేట గ్రామపంచాయతీలో సోమవారం ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల సహకారం కూడా అంతే ముఖ్యమన్నారు.మహిళల రక్షణ, యువతలో చట్టాల పట్ల అవగాహన, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలను గ్రామసభల ద్వారానే గుర్తించి పరిష్కరించుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఇంచార్జి సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, గ్రామ సర్పంచ్ సరికేల్లా లతీక, ఉపసర్పంచ్ జాన వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి నరసారెడ్డి, వార్డు సభ్యులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






