విడాకుల వివాదం.. ఆర్థిక ఒత్తిడితో భర్త బలవన్మరణం

by Jakkula.Mamatha |

విడాకుల వివాదం, ఆర్థిక సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలో జరిగింది.

విడాకుల వివాదం.. ఆర్థిక ఒత్తిడితో భర్త బలవన్మరణం
X

దిశ,మేడిపల్లి: విడాకుల వివాదం, ఆర్థిక సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. చెంగిచెర్ల ఎంఎల్‌ఆర్ కాలనీలో నివాసముంటున్న రసూల్ జాకబ్(33), ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. 2024 జనవరిలో ఆల్వాల్‌కు చెందిన మేఘనతో వివాహం జరిగింది. కొంతకాలానికే దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో మేఘన వరకట్న వేధింపుల కేసు నమోదు చేయగా, అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. విడాకుల వ్యవహారంపై ఇరు కుటుంబాల మధ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, సెటిల్‌మెంట్ కోసం డబ్బు సమకూర్చేందుకు రసూల్ జాకబ్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

కుటుంబ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు, కేసు ఒత్తిడితో కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 5వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో గదికి తాళం వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి లోపలికి వెళ్ళేసరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి తల్లి రసూల్ పద్మ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Next Story