జొన్నల తూకం ప్రారంభం.. ఊపిరిపీల్చుకున్న జొన్న రైతులు

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-08 06:36:24  IST  )

కుబీర్ మార్కెట్ యార్డులో సోమవారం ఉదయం జొన్నల తూకం వేసే కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, స్థానిక సర్పంచ్ కందుర్ సాయినాథ్ ఎపిఎం దత్తాత్రి కలిసి ప్రారంభించారు.

జొన్నల తూకం ప్రారంభం.. ఊపిరిపీల్చుకున్న జొన్న రైతులు
X

దిశ, కుబీర్: కుబీర్ మార్కెట్ యార్డులో సోమవారం ఉదయం జొన్నల తూకం వేసే కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, స్థానిక సర్పంచ్ కందుర్ సాయినాథ్ ఎపిఎం దత్తాత్రి కలిసి ప్రారంభించారు. కొన్ని రోజులుగా ఆందోళనలో ఉన్న జొన్న సాగు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు టోకన్ పొందిన రైతులు వాహనాల్లో జొన్నలు తీసుకొని తరలివచ్చారు. మార్కెట్ యార్డు ముందు వాహనాలు బారులు తీరాయి. కూపన్లు కోసం నిద్రలేని రాత్రి గడిపామని, ఒకే రోజు వేల మంది తరలి వచ్చిన రైతులు శాంతించారు. అదికారులు ఆగస్టు 15 వరకు కూపన్లు జారీ చేసినప్పటికీ, మరికొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేస్తే జులై మొదటి వారం వరకు పూర్తి కావస్తాయని రైతులు మాట్లాడుకుంటున్నారు.

రైతులు వర్షాలతో ఇబ్బందులు పడకుండా మరికొన్ని చోట్ల కేంద్రాలను ప్రారంభించాలని రైతులు వాపోతున్నారు. మండలంలో 4వేలకు పైగా రైతులు 10,400ఎకరాల్లో జొన్న సాగు చేశారు. ప్రైవేట్ లో 2200₹ పలికిన ధర రెండు రోజుల్లో 400₹పెరిగింది. రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని, ఇబ్బందులు కలగకుండా చూడాలని వాపోతున్నారు. రైతులు తమ సిబ్బందికి సహకరించాలని, కేటాయించిన తేదీల వారీగా పంటను కేంద్రానికి తీసుకురావాలని, నాణ్యమైన పంటను తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సంబంధిత శాఖ అధికారులు రైతులకు సూచించారు.

Next Story