ఏన్కూరు మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు

by Jakkula.Mamatha |

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, టాక్స్ కాగితాలు అందుబాటులో ఉంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ అన్నారు.

ఏన్కూరు మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు
X

దిశ, ఏన్కూర్: వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, టాక్స్ కాగితాలు అందుబాటులో ఉంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ అన్నారు. సోమవారం ఏన్కూరు మండల కేంద్రంలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తెలియజేశారు. ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు బాధ్యులవుతారని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. స్కూల్ బస్సులు, ట్రాక్టర్లు, తదితర వాహనాలను చెక్ చేశారు. ఆయన వెంట సిబ్బంది తదితరులు ఉన్నారు.

Next Story