- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు స్టేషన్ ఘనపూర్‌లో డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి:ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం పరిశీలించారు.

దిశ, జనగామ: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం పరిశీలించారు. నియోజకవర్గంలో రూ.60.62 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 7 విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల పై సంబంధిత శాఖ అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం సుమారు 6 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభా ప్రాంగణం, వేదిక వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి.. తొలిసారిగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి వస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు.
వేలేరు మండలం పీచరలో 132/33 కేవీ సబ్‌స్టేషన్, చిల్పూర్ మండలం కొండాపూర్, జఫర్‌గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లను మంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. అలాగే చిల్పూర్ మండలం లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఇళ్లపై నుంచి వెళ్తున్న 33/11 కేవీ, సర్వీస్ లైన్ల మార్పిడి సమస్యలతో పాటు రఘునాథపల్లి 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను 220/132 కేవీ సబ్‌స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని ఉప ముఖ్యమంత్రిని కోరనున్నట్లు చెప్పారు. ఈ సబ్‌స్టేషన్ల ఏర్పాటుతో నియోజకవర్గంలో దాదాపు 90 శాతం విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒకే రోజు ఒకే వేదికపై 7 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, విద్యుత్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






