రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే ఆదాయ పన్ను కడతాం.. సింగరేణి కార్మికులకు కిషన్ రెడ్డి బంపరాఫర్

by Kema Shiva Kumar |

యూపీఏ సర్కార్ హయాంలో బొగ్గు గనుల మంత్రి జైలుకు వెళ్లారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే ఆదాయ పన్ను కడతాం.. సింగరేణి కార్మికులకు కిషన్ రెడ్డి బంపరాఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ ఎఫ్ఎన్‌సీసీ (FNCC)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కోల్ అంటే స్కామ్, అవినీతి, అనిశ్చితికి కేరాఫ్‌గా ఉండేదని కామెంట్ చేశారు. యూపీఏ సర్కార్ హయాంలో బొగ్గు గనుల మంత్రి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. రూ.1.86 లక్షల కోట్ల బొగ్గు స్కామ్ జరిగిందని కాగ్ (CAG) అప్పట్లో నివేదిక ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కేటాయించిన కోల్ మైన్స్‌ను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసిందని అన్నారు.

కానీ, గత 12 ఏళ్లలో అవినీతి అనేదే లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అన్నారు. అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్‌ (Gasification)పై అధ్యయనం చేస్తున్నామని, కోల్ గ్యాసిఫికేషన్‌పై 11న ప్రైవేటు కంపెనీలతో చర్చిస్తామని వెల్లడించారు. 2028 నాటికి దేశంలో అన్ని కోల్ బ్లాక్‌లను మూసేస్తామని స్పష్టం చేశారు. క్రిటికల్ మినరల్స్ మిషన్ ప్రోగ్రామ్‌కు రూ.1,500 కోట్లు మంజూరు చేశామని, ఇప్పటి వరకు 24 క్రిటికల్ మినరల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. అర్జెంటీనాలో 6 క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్ తీసుకున్నామని పేర్కొన్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం వస్తే.. సింగరేణి కార్మికుల ఆదాయ పన్నును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని బంపరాఫర్ ఇచ్చారు.

Next Story