మల్లవరపు సేవలు అమూల్యం: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

విశాఖకు చెందిన క్రైస్తవ మత బోధకులు, విశ్రాంత ఆర్చ్ బిషప్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు..

మల్లవరపు సేవలు అమూల్యం: సీఎం చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖకు చెందిన క్రైస్తవ మత బోధకులు, విశ్రాంత ఆర్చ్ బిషప్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ మల్లవరపు ప్రకాష్ సమాజానికి చేసిన సేవలు ఎనలేనివని సీఎం వ్యాఖ్యానించారు. కడప, విజయవాడ, విశాఖపట్నంలో బిషప్‌గా సుదీర్ఘకాలం పాటు ఆయన అందించిన సేవలు ఎనలేనివని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకాష్ కుటుంబ సభ్యులకు, క్రైస్తవ మత పెద్దలకు వారి అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని ముఖ్యమంత్రి తెలిపారు.

Next Story