- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్‌ను ఓవర్‌టేక్ చేసి చెట్టును ఢీకొన్న కారు.. యువకుడు మృతి
అతివేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది.

దిశ, చందంపేట: అతివేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. చందంపేట మండలం కుమ్మరిగూడెం హ్యాబిటేషన్ అంకెతండాకు చెందిన తంగెళ్ల యశ్వంత్ రెడ్డి (23) ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యశ్వంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి నేరేడుగొమ్ము లోని తన మేనమామ శశాంక్ రెడ్డిని కలిశాడు. అనంతరం ఇద్దరూ పోలేపల్లికి వెళ్లి స్నేహితులతో కలిసి విందులో పాల్గొన్నారు. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో గాగిల్లాపురం వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో గొడుగు ఏడుకొండలు, గొడుగు శివ ప్రయాణిస్తున్న బైక్‌ను ఓవర్‌టేక్ చేసి అతివేగంగా ముందుకు దూసుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లగానే వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్‌లో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి తంగెళ్ల శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.






