- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు సభలో భాగంగా టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలో సర్పంచ్ గంధం సారయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామసభకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దిశ, టేకుమట్ల : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు సభలో భాగంగా టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలో సర్పంచ్ గంధం సారయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామసభకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామానికి అవసరమైన రహదారులు, మహిళా సంఘ భవనాల నిర్మాణం, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. వానాకాలం నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆయన, శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలని, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డులో రైతులకు అవసరమైన వ్యవసాయ సూచనలు అందుబాటులో ఉంచాలని సూచించారు. భూసారాన్ని పరిరక్షించేందుకు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను వివరించారు. 2020లో సాదా బైనామా కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అర్హులైన ప్రతి రైతుకు పట్టా అందేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే జాబ్ కార్డులు లేని అర్హులైన రైతులకు తప్పనిసరిగా జాబ్ కార్డులు జారీ చేయాలని ఎంపీడీవోను కోరారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంధం సారయ్య మాట్లాడుతూ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. అలాగే రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ మీ తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, సీఐ మల్లేష్, ఎస్సై అమూల్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






