కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

by Taduka Kalyani |

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొనియాడారు.

కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశానికే ఆదర్శం
X

దిశ, సంగారెడ్డి : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొనియాడారు. కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలం అయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల సమన్వయ కర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సభ్యత్వ నమోదు ఇంచార్జి చంద్ర గౌడ్ ను శాలువాతో సన్మానించారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై సమన్వయ కర్తలతో విస్తృతంగా చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తప్పుడు హామీలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్లుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇంచార్జి చంద్ర గౌడ్ మాట్లాడుతూ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. ఈసారి డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ బలాన్ని చాటాలని సూచించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి పట్టణ సమన్వయ కర్తలు హకీం, వెంకటేశ్వర్లు , విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరితో పాటు సంగారెడ్డి మండలం సమన్వయ కర్తలు చక్రపాణి, కంది మండలం సమన్వయ కర్తలు మధుసూదన్ రెడ్డి, కొండల్ రెడ్డి, కొండాపూర్ సమన్వయ కర్తలు విఠల్, సదాశివపేట పట్టణ సమన్వయ కర్తలు చీల మల్లన్న, కోడూరు రమేష్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి , మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, సుధీర్ రెడ్డి, మల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story