రైల్వే ఫ్లైఓవర్‌పై విషాదం.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

by Taduka Kalyani |

జహీరాబాద్ పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

రైల్వే ఫ్లైఓవర్‌పై విషాదం.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
X

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనలో రాయికోడ్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన పకిత్ సోహెల్ రండి రహీం (23) మృతి చెందినట్లు జహీరాబాద్ టౌన్ ఎస్ఐ లవకుమార్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోహెల్ తన స్నేహితుడి వలీమా (విందు) కార్యక్రమానికి జహీరాబాద్‌కు వచ్చాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా, మార్గమధ్యలో రైల్వే ఫ్లైఓవర్‌పై అతను నడుపుతున్న మోటార్‌సైకిల్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతని స్నేహితులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ టౌన్ ఎస్ఐ లవకుమార్ వెల్లడించారు.

Next Story