కార్మికుల సంక్షేమం కోసం మరింత సమర్థవంతంగా పని చేయాలి :మంత్రి పొన్నం ప్రభాకర్

by Batti.Sumithra |

జల మండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మొగుళ్ళ రాజిరెడ్డిను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు సభ్యులు వేం.నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ లు అభినందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

కార్మికుల సంక్షేమం కోసం మరింత సమర్థవంతంగా పని చేయాలి :మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, హిమాయత్ నగర్ : జల మండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మొగుళ్ళ రాజిరెడ్డిను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు సభ్యులు వేం.నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ లు అభినందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం, హైదరాబాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ లు ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, జలమండలి గుర్తింపు సంఘం తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మొగుళ్ళ రాజిరెడ్డిను శాలువా, పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా కార్మిక-అనుకూల సంక్షేమ-ఆధారిత పార్టీగా పేరొందిందని, కాంగ్రెస్ పార్టీ కార్మికుల సంక్షేమం కోసం, వారి సమస్యలను పరిష్కరించడం కోసం ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. వివిధ రంగాలలో సామాజిక న్యాయం కార్మికుల హక్కుల కోసం చురుకుగా పోరాడుతున్న కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీను మరింత బలోపేతం చేస్తూ కార్మికుల సంక్షేమం కోసం మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆకాంక్షించారు. మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ సంక్షేమమే ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటిస్తూ, తన విజయానికి సహకరించిన జలమండలి ప్రతి కార్మికుడికి, నాయకులకు, కార్యకర్తకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఈయూ ప్రధాన కార్యదర్శి కె. రాఘవేంద్ర రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story