‘మకుటం’ టీజర్ అప్డేట్ ఇచ్చిన విశాల్.. 30 ఏళ్ల కల నిజం కాబోతోందంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

చివరికి, దర్శకుడిగా నా అధికారిక అరంగేట్రం జరుగుతోంది. ఈ కల నిజం కావాలని నేను గత 30 ఏళ్లకు పైగా ఎంతో ఆశతో, ఆరాటంతో ఎదురుచూశాను.

‘మకుటం’ టీజర్ అప్డేట్ ఇచ్చిన విశాల్.. 30 ఏళ్ల కల నిజం కాబోతోందంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విశాల్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఇప్పుడు సరికొత్త అవతారంలోకి మారారు. ‘మకుటం’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం బాధ్యతలు కూడా తీసుకున్నాడు. తమిళంలో ‘మగుడం’ పేరుతో రాబోతుంది. ఆర్ బి చౌదరి సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. విశాల్ సరసన దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మకుటం' చిత్రం పూర్తిగా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్‌ఫుల్ మాఫియా, క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రాబోతున్నట్లు విశాల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. "చివరికి, దర్శకుడిగా నా అధికారిక అరంగేట్రం జరుగుతోంది. ఈ కల నిజం కావాలని నేను గత 30 ఏళ్లకు పైగా ఎంతో ఆశతో, ఆరాటంతో ఎదురుచూశాను. మకుటంతో కల నిజం కాబోతోంది. మేము ఎంతో శ్రద్ధగా, ఇష్టపడి రూపొందించిన ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. జూన్ 10న ‘మకుటం’ టీజర్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. మాపై దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి" అని ఎమోషనల్ అయ్యారు.

Next Story