పోడు భూముల వివాదం.. తోపులాటలో స్వల్ప గాయాలు

by Kodari Anjali |

గిరిజనులకి, ఫారెస్ట్ ఉద్యోగులకు ఇవాళ పోడు భూముల వివాదం చోటుచేసుకుంది.

పోడు భూముల వివాదం.. తోపులాటలో స్వల్ప గాయాలు
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ పరిధిలోని గుడిపాడు రోడ్డు రుద్రాక్షపల్లి బీట్ పరిధిలోని సర్వే నెంబర్ 157, 158, కంపార్ట్మెంట్ భూముల్లో సోమవారం మధ్యాహ్నం గిరిజనులకి, ఫారెస్ట్ ఉద్యోగులకు పోడు భూముల వివాదం చోటుచేసుకుంది. రుద్రాక్షపల్లి బీట్ పరిధిలోని 157, 158, సర్వే నెంబర్లలో గత ప్రభుత్వ హయాంలో గుడిపాడు గిరిజనులకు 28 మందికి 22.3 ఎకరాల విస్తీర్ణం భూమికి పోడు ఆర్ ఓ ఆర్ పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం గిరిజనులు ఆ భూమినిసాగు చేసుకుంటున్నారు. అదే సర్వే నెంబర్లు మిగిలి ఉన్న ఆరు హెక్టార్ల ఫారెస్ట్ భూమికి ఇటీవల ఫారెస్ట్ అధికారులు స్ట్రంచ్ ఏర్పాటు చేయగా గిరిజనులు స్ట్రంచ్ ను తీసివేశారు. అన్యాయంగా 6. హెక్టార్ల ఫారెస్ట్ భూమిలోకి చొరబడి పోడు నరుకుతున్న క్రమంలో ఫారెస్ట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని గిరిజనులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...

ఇద్దరు గిరిజనులను ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేసి తరలిస్తున్న క్రమంలో గిరిజనులు అడ్డుకోవడంతో.. ఈ తోపులాటలో స్వల్ప గాయాలయ్యాయి. పోడు వివాదానికి కారణమైన సత్తుపల్లి పట్టణం గుడిపాడుకు చెందిన మారుతి వెంకటేశ్వర్లు, మారుతి రజనీని అరెస్టు చేసి ఫారెస్ట్ ఆఫీస్‌కి తరలించారు. పలువురు గిరిజనులపై పలు కేసులు నమోదు చేశారు. గిరిజన భూమిలో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ గుడిపాడుకు చెందిన పోడుభూము గిరిజనులు ఆరోపిస్తున్నారు. గత ౨౦ ఏళ్ల నుంచి అదే భూమిలోని అనేక పంటలు సాగు చేశామని గిరిజన భూములను ఫారెస్ట్ ఉద్యోగులు ఫారెస్ట్ భూమిగా చిత్రీకరించి పలుమార్లు గిరిజనులపై దాడి చేయడం, గిరిజన భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గిరిజనులపై ఫారెస్ట్ ఉద్యోగుల దౌర్జన్యాలు ప్రభుత్వం వెంటనే స్పందించి ఫారెస్ట్ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Next Story