వివాహేతర సంబంధం అనుమానంతో దాడి.. ఇద్దరి అరెస్ట్

by Taduka Kalyani |

వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యపై, అలాగే మరో వ్యక్తిపై కర్రలతో దారుణంగా దాడి చేసిన అన్నదమ్ములను కుకునూర్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

వివాహేతర సంబంధం అనుమానంతో దాడి.. ఇద్దరి అరెస్ట్
X

దిశ, కొండపాక: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యపై, అలాగే మరో వ్యక్తిపై కర్రలతో దారుణంగా దాడి చేసిన అన్నదమ్ములను కుకునూర్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కుకునూర్ పల్లి ఎస్ ఐ పి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం పి.టి.వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పెర్క సత్యనారాయణ (35) హైదరాబాద్‌లో ఉంటూ వారానికోసారి ఇంటికి వచ్చేవాడు. గత కొంతకాలంగా తన భార్య రజిత, ఇంటి ఎదురుగా ఉండే పెర్క ప్రవీణ్‌తో మాట్లాడుతోందని సత్యనారాయణ అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రవీణ్‌ను మట్టుబెట్టాలని తన తమ్ముడు మహేందర్ (30)తో కలిసి పథకం వేశాడు. జూన్ 7 రాత్రి సత్యనారాయణ హైదరాబాద్ నుంచి ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా ఇంటికి వచ్చాడు. తలుపులు గట్టిగా తోసుకుని లోపలికి వెళ్లగా.. అక్కడ ఉన్న భార్య, ప్రవీణ్ బయటకు పారిపోవడానికి ప్రయత్నించారు. దాంతో సత్యనారాయణ వారిని పట్టుకుని కర్రతో ఇద్దరి తలల పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం తన తమ్ముడు మహేందర్‌ను పిలిపించి, పశువుల తాడుతో ప్రవీణ్ చేతులు కట్టేసి ఇద్దరూ కలిసి మళ్లీ కొట్టారు. స్థానికులు గమనించి వారిని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న కుకునూర్ పల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, దాడికి ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకున్నారు.

Next Story