95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి

by Taduka Kalyani |

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు 95 శాతం పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు.

95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి
X

దిశ, మెదక్ ప్రతినిధి : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు 95 శాతం పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ చివరి దశలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 82,251 మంది రైతుల నుంచి 3,80,358 .240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 65,394 మంది రైతులకు 694,32 కోట్ల రూపాయలు చెల్లింపులు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 268 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసి వేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తి అయిన కేంద్రాల్లోని సిబ్బంది, వాహనాలు, హమాలీని ధాన్యం కొనుగోళ్లు నడుస్తున్న కేంద్రాల్లో ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి త్వరిత గతిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్,సివిల్ సప్లై శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు,ఆర్డీవోలు, తహశీల్దార్లు,ధాన్యం సేకరణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story