కురుక్షేత్రలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

by Ramesh Naini |

హర్యానాలోని కురుక్షేత్ర రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఓ గూడ్స్ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి.

కురుక్షేత్రలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానాలోని కురుక్షేత్ర రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఓ గూడ్స్ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అదే స్టేషన్‌లో ఒక ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించేందుకు వచ్చిన సమయంలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. కురుక్షేత్ర నుంచి లోడింగ్ నిమిత్తం పెహోవా రోడ్ (ధాండ్) వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టాలు తప్పిన బోగీల్లో ఒకటి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో.. రైల్వే ఓవర్‌హెడ్ విద్యుత్ సరఫరా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో బోగీల చక్రాలు కూడా దెబ్బతిన్నాయి.

ఇది గూడ్స్ రైలు కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారి రామ్ నివాస్ తెలిపారు. రైల్వే సిబ్బంది ప్రస్తుతం నష్టాన్ని అంచనా వేస్తున్నారని, విద్యుత్ వ్యవస్థను, ట్రాక్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Next Story