Nirmala Sitaraman: 'జన్ ధన్' ఖాతాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి కోట్లాది మంది

by S Gopi |

ఈ పథకం ద్వారా 58 కోట్లకు పైగా ఖాతాలు తెరుచుకోగా, కోట్లాది మంది మొదటిసారిగా అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి అడుగుపెట్టారు

Nirmala Sitaraman: జన్ ధన్ ఖాతాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి కోట్లాది మంది
X

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంక్ అకౌంట్లు లేని కోట్లాది మంది సామాన్యులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడంలో 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' (పీఎంజేడీవై) అద్భుత విజయం సాధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాజాగా 58 కోట్ల అకౌంట్ల మైలురాయిని దాటిన సందర్భంగా.. ఈ పథకం దేశ బ్యాంకింగ్ రంగ హిస్టరీలోనే అతిపెద్ద 'గేమ్ చేంజర్' అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొనియాడారు. దేశంలోని ప్రతీ ఒక్కరికీ డిజిటల్, బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఈ పథకం.. దేశ ఆర్థిక రూపురేఖలను పూర్తిగా మార్చేసిందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 58 కోట్లకు పైగా ఖాతాలు తెరుచుకోగా, కోట్లాది మంది మొదటిసారిగా అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. జన్ ధన్ ఖాతాల వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతోంది. దీంతో మధ్యవర్తులు, లీకేజీల సమస్యలు గణనీయంగా తగ్గాయి. ఇప్పటివరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా సుమారు రూ. 45 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాలకు జమ చేసింది. పేదల సంక్షేమం, పారదర్శకత, డిజిటల్ చెల్లింపుల విస్తరణలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Next Story