పెన్షన్ కోసం తండ్రిని చంపిన పిల్లలు.. కోర్టు సంచలన తీర్పు

by Batti.Sumithra |

కుషాయిగూడ కోర్టు న్యాయమూర్తి సోమవారం సంచలన తీర్పునిచ్చారు.

పెన్షన్ కోసం తండ్రిని చంపిన పిల్లలు.. కోర్టు సంచలన తీర్పు
X

దిశ, సిటీక్రైం : కుషాయిగూడ కోర్టు న్యాయమూర్తి సోమవారం సంచలన తీర్పునిచ్చారు. తండ్రిని చంపిన కొడుకు, కూతురుకు ఉరి శిక్ష, హత్యకు సహకరించిన భార్యకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధి మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన మారుతి సుతార్ రైల్వే ఉద్యోగి. అతని పెన్షన్ బెనిఫిట్స్ పై కన్నేసిన భార్య గంగా భాయి, కొడుకు కిషన్ సుతార్, కూతురు ప్రాపుల్లా అలియాస్ పప్పిలు మర్డర్ కు ప్లాన్ చేశారు. మారుతి సుతార్ కు దత్తురా విషాన్ని అన్నంలో కలిపి రెండు రోజుల పాటు పెట్టారు. ఈ విషాహారం తిన్న మారుతి సుతార్ మరణించాడు.

ఆ తర్వాత డెడ్ బాడీని మాయం చేసేందుకు ముక్కలు, ముక్కలుగా చేసి బకెట్ లో వేస్తుండగా తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన పై దర్యాప్తు చేసిన ఇన్స్ పెక్టర్ లు మన్ మోహన్ , జగదీశ్వర్, రవికుమార్ లు అదనపు పీపీలు నిర్మల, యాదగిరి, రామక్రిష్ణారావు, కోర్డు డ్యూటీ ఆఫీసర్ వై.జంగయ్య, మహేష్ బాబు, లైజనింగ్ ఆఫీసర్ దివిరాజు, మానిటరింగ్ ఆఫీసర్ ఏసీపీ రమేశ్ కుమార్, నరసింహారెడ్డిలు నిరంతరం కేసు విచారణను పకడ్బందిగా ఫాలో చేశారు. కోర్టు విచారణలో సాక్ష్యాధారాలను నిరూపించడంతో న్యాయమూర్తి ఈ ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. సోమవారం కిషన్ సుతార్(47), ప్రాపుల్లా(36) లకు ఉరి శిక్షను, గంగా భాయి(65) కు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తు తీర్పును వెల్లడించింది. నిందితులకు శిక్షలు పడే విధంగా పనిచేసిన సిబ్బందిని సీపీ సుమతి అభినందించారు.

Next Story