విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం విషాదకరం: పీవీఎన్ మాధవ్

by Vemula.Srinu Prasad |

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన కార్మిక వర్గానికే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ విషాదంలో ముంచిందని ఆయ‌న పేర్కొన్నారు. ..

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం విషాదకరం: పీవీఎన్ మాధవ్
X

దిశ‌, ఏపీ బ్యూరో: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన కార్మిక వర్గానికే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ విషాదంలో ముంచిందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్రక‌ట‌న చేస్తూ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో జరిగిన ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ఘటనకు గల కారణాలను సమగ్రంగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. అలాగే బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి పరిశ్రమ యాజమాన్యం బాధ్యత అని మాధవ్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story