ఆకాశాన్నంటుతున్న టమాటా ధర

by Batti.Sumithra |

నిత్యం వంటల్లో వాడే టమాటా ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల పై పెను భారం పడుతోంది.

ఆకాశాన్నంటుతున్న టమాటా ధర
X

దిశ, కార్వాన్ : నిత్యం వంటల్లో వాడే టమాటా ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల పై పెను భారం పడుతోంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ధరలు రెట్టింపు కావడంతో మార్కెట్‌కు వెళ్లే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. బెంగళూరుతో పాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లో గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయల పంటలు, ముఖ్యంగా టమాటా తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. దీంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం అక్కడ కేజీ టమాటా ధర రూ. 60 పలుకుతోంది. గుడిమల్కాపూర్ మార్కెట్‌లో రెండు వారాల క్రితం వరకు కిలో రూ. 20 నుంచి రూ. 25 పలికిన టమాటా ధర, ఇప్పుడు ఏకంగా కిలో రూ. 40 నుంచి రూ. 50 కి చేరింది. ఇక నాణ్యమైన బెంగళూరు టమాటా ధరలు అయితే ఏకంగా రూ. 80 నుంచి రూ. 100 వరకు పలుకుతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరల్లో టమాటా వేయాలంటేనే భయపడాల్సి వస్తోందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలను అదుపు చేయాలని సామాన్య ప్రజలు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story