రెండు రోజుల క్రితం చిన్నారి మిస్సింగ్.. ఇంకా తెలియని ఆచూకీ

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక గ్రామంలో రెండేళ్ల చిన్నారి అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది....

రెండు రోజుల క్రితం చిన్నారి మిస్సింగ్.. ఇంకా తెలియని ఆచూకీ
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) తుని మండలం దొండవాక గ్రామం(Dondavaka village)లో రెండేళ్ల చిన్నారి అదృశ్యం(Child Missing) కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గ్రామం అంతటా జల్లెడ పడుతున్నారు. పాప ఆచూకీ కోసం అన్ని కోణాల్లోనూ ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

రెండు రోజులు గడుస్తున్నా..

అయితే చిన్నారి అదృశ్యమై రెండు రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశారు. గ్రామం, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సుమారు 8 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్థానికులను అడిగి వివరాలు సేకరించడంతో పాటు, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా ప్రమాదవశాత్తు ఎక్కడైనా పడిపోయిందా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Next Story