Stock Market: స్టాక్ మార్కెట్లలో గ్లోబల్ టెన్షన్స్

by S Gopi |

మార్కెట్ పతనానికి ప్రధాన కారణం చమురు ధరల పెరుగుదల. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 97 డాలర్ల సమీపానికి చేరింది.

Stock Market: స్టాక్ మార్కెట్లలో గ్లోబల్ టెన్షన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లను మరోసారి యుద్ధ భయాలు కమ్మేశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం, ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకడం, అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాలు జరగడం వంటి కారణాలతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్కెట్ పతనానికి ప్రధాన కారణం చమురు ధరల పెరుగుదల. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 97 డాలర్ల సమీపానికి చేరింది. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం, దిగుమతి వ్యయం, కంపెనీల ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించారు. దీంతో సెన్సెక్స్ 719 పాయింట్లు కోల్పోయి 73,524 వద్ద, నిఫ్టీ 244 పాయింట్లు పడిపోయి 23,123 వద్ద ముగిశాయి. ఇది వరుసగా రెండో రోజు మార్కెట్ నష్టాల్లో ముగియడం గమనార్హం. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 95.53 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. జపాన్, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికాలోనూ టెక్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఏఐ ఆధారిత ర్యాలీ చాలా వేగంగా పెరిగిందనే అభిప్రాయంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు.

Next Story